మల్లెపూల థీమ్‌ బ్లౌజ్‌లో లైగర్ బ్యూటీ.. పీకేస్తారు జాగ్రత్త అంటూ నెటిజన్ల కామెంట్స్

by I. Sairam |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘లైగర్’(Liger) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మల్లెపూల థీమ్‌ బ్లౌజ్‌లో లైగర్ బ్యూటీ.. పీకేస్తారు జాగ్రత్త అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘లైగర్’(Liger) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చిత్రం అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసి బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా అనన్య పాండే తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో మల్లె పూల థీమ్‌తో బ్లౌజ్ డిజైన్ చేయించుకుని ఫొటోస్‌కి పోజులిచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దానిని చూసిన నెటిజన్లు మల్లెపూలు పీకేస్తారు జాగ్రత్త అని, వాడిపోతాయి జాగ్రత్త అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు అనన్య పాండే పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story