బిగ్ బాస్‌లో లెస్బియన్స్.. ఆ ఇద్దరమ్మాయిల రొమాంటిక్ వీడియో వైరల్.. వర్షంలో ఆ పని చేసి షాక్ ఇచ్చారుగా..

by Sujitha Rachapalli |

మలయాళం బిగ్ బాస్ సీజన్ 7 హైయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా లెస్బియన్ కపుల్ గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. అధీలా నజ్రీన్, ఫాతిమా నూరా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడగా.. వర్షంలో వీరిద్దరి రొమాంటిక్ వీడియో వైరల్ అవుతుంది.

బిగ్ బాస్‌లో లెస్బియన్స్.. ఆ ఇద్దరమ్మాయిల రొమాంటిక్ వీడియో వైరల్.. వర్షంలో ఆ పని చేసి షాక్ ఇచ్చారుగా..
X

దిశ, వెబ్ డెస్క్ : మలయాళం బిగ్ బాస్ సీజన్ 7 హైయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా లెస్బియన్ కపుల్ గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. అధీలా నజ్రీన్, ఫాతిమా నూరా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడగా.. వర్షంలో వీరిద్దరి రొమాంటిక్ వీడియో వైరల్ అవుతుంది. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ డ్యాన్స్ చేసిన వీడియో.. చాలా మందిని పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యేలా చేసినా.. కొందరు మాత్రం నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.

హౌజ్‌లోనూ ఇదే జరిగింది.. ఇంటి సభ్యులంతా వీరి రిలేషన్‌ను యాక్సెప్ట్ చేసినా.. ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం తప్పుపట్టారు. వారి సెక్సువాలిటీపై నోరు పారేసుకున్నారు. ఇలాంటి వారిని ఇంటికి ఇన్వైట్ చేస్తారా అని మాట్లాడుకోవడంతో.. హోస్ట్ మోహన్ లాల్ కూడా ఫైర్ అవ్వాల్సి వచ్చింది. మనుషులను మనుషుల్లా చూడటం నేర్చుకోవాలని.. గౌరవించాలని సూచించారు. వాళ్లతో ఉండటం ఇష్టం లేకపోతే.. ఇంటి నుంచి ఇప్పుడే వెళ్లిపోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్న వారికి కూడా హోస్ట్ మాటలు వర్తిస్తాయని.. బుద్ధి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.

Next Story