- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
L.B. Sriram: ఈ.వి.వి. సత్యనారాయణ చేసిన పనికి అవమానంగా ఫీలయ్యాను
ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ... వారసుడు సినిమా సమయంలో నాతో పాటు చాలామంది రైటర్స్ జాయిన్ కావడంతో నేను అవమానంగా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: నటుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఎల్బీ శ్రీరామ్ ఒకరు. తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి, తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ సీనియర్ నటుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, దర్శకుడు ఈ.వీ.వీ సత్యనారాయణ గారితో తనకున్న అనుబంధాన్ని, అలాగే ఒకానొక సమయంలో ఆయన వల్ల ఎదురైన అవమానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ… “ఈ.వీ.వీ గారు నన్ను నటుడిగా, రచయితగా గుర్తించి ఎంతో ప్రోత్సహించారు.
‘అప్పుల అప్పారావు’, ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రాలకు నేను సోలో రైటర్‌గా ఆయన దగ్గర పనిచేశాను. ఆ సినిమాల్లోని ప్రతి ఒక్క మాట కోసం ఎంతో అంకితభావంతో పనిచేశాను. ఆ చిత్రాల ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి నాగార్జున హీరోగా ‘వారసుడు’ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ఆ సినిమాలో నేను ఒక్కడినే కాకుండా చాలామంది రైటర్స్ పనిచేశారు. అలా చాలామంది రచయితలతో కలిసి పని చేయడం నాకు నచ్చలేదు. నా అనుమతి లేకుండా అంతమంది రైటర్స్‌ను పిలవడం వల్ల నాకు అవమానంగా అనిపించింది అని చెప్పారు.
ఈ.వీ.వీ గారు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు కూడా చేసేవారు. అలా ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఆయన చుట్టూ అనేకమంది రైటర్స్ ఉండేవారు. వాళ్లందరినీ ఆయన సరైన పద్ధతిలో సర్దుబాటు చేసుకునేవారు. కానీ నేను మాత్రం ఒకేసారి ఒకే సినిమాకు మాత్రమే పనిచేసేవాడిని. ఆ తర్వాత నాతో పాటు మరికొంతమంది రైటర్స్ కూడా అదే సినిమాలో భాగం కావడంతో, కొంతకాలం ఆయనకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తర్వాత కొంతమంది చొరవ వల్ల మళ్లీ మేమిద్దరం కలిసి పని చేశాం అని ఎల్బీ శ్రీరామ్ చెప్పుకొచ్చారు.






