నన్ను నేను ఇలాంటి పాత్రలో చూసుకోలేదు..

by Chukka Sudharani |

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ మరిన్ని సినిమా విశేషాలు పంచుకుంది.

నన్ను నేను ఇలాంటి పాత్రలో చూసుకోలేదు..
X

దిశ, సినిమా: హిట్ పెయిర్ శివాజీ(Shivaji), లయ (Laya) జంటగా నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani)సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ కాగా.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ మరిన్ని సినిమా విశేషాలు పంచుకుంది. ‘శివాజీ నేను కలిసి నటించి 20 ఏళ్లు అవుతుంది. ఈ చిత్రంలో నటించాలి అనగానే ఫ్యామిలీ డ్రామా అనుకున్నాను. కానీ ఇది అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. అందరికి కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. ఈ కామెడీ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్‌ ట్విస్ట్‌తో పాటు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఇది డార్క్‌ కామెడీ జోనర్‌. కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. కథ వినగానే యూనిక్‌ ఫీలింగ్‌ వచ్చింది. ఇందులో నేను ఉత్తర పాత్రలో నటించాను. ఇప్పటి వరకు నన్ను నేను ఇలాంటి పాత్రలో చూసుకోలేదు. మంగపతిలాంటి పవర్‌ఫుల్‌ పాత్ర చేసిన హీరోను డామినేట్‌ చేసే పాత్ర నాది. కానీ శివాజీ ఎంతో ఎంకరైజ్‌ చేశారు. నా రోల్ బాగా నచ్చింది. నేను, శివాజీ కలిసి నటించిన సన్నివేశాలు ఎంతో హిలేరియస్‌‌గా ఉంటాయి. డైరెక్టర్ సుధీర్‌ శ్రీరామ్‌ స్టోరీ ఎంత బాగా రాసుకున్నాడో.. అంత క్లారిటీగా తెరకెక్కించాడు. సినిమా ఎంతో హిలేరియస్‌గా అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది’ అన్నారు.

Next Story