Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి సినిమా అప్డేట్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటోన్న ట్రైలర్

by Chukka Sudharani |

డిఫరెంట్ జానర్స్ ఎంచుకుంటూ క్రేజ్ తెచ్చుకుంటున్న అథర్వా మురళీ.. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి సినిమా అప్డేట్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటోన్న ట్రైలర్
X

దిశ, సినిమా: డిఫరెంట్ జానర్స్ ఎంచుకుంటూ క్రేజ్ తెచ్చుకుంటున్న అథర్వా మురళీ (Atharva Murali).. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ‘టన్నెల్’ (Tunnel) అనే టైటిల్‌తో రాబోతున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీకి రవీంద్ర మాధవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రాబోతున్న ‘టన్నెల్’ చిత్రాన్ని.. తెలుగులోకి ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘యూనిఫామ్ వేసుకున్న తర్వాత అందరూ ఫ్యామిలీనే’ అని హీరో చెప్పిన డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో లవ్ ట్రాక్‌కి కూడా అంతే ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), అధర్వ కాంబో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌తో టన్నెల్ చిత్రంపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి.

Next Story