Lavanya Tripathi: బేబీ బంప్‌తో కనిపించిన మెగా కోడలు.. సో క్యూట్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by I. Sairam |

సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

Lavanya Tripathi: బేబీ బంప్‌తో కనిపించిన మెగా కోడలు.. సో క్యూట్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఫుల్ మార్కులే కొట్టేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)తో పీకల్లోతు ప్రేమలో పడ్డది ఈ అమ్మడు. అలా కొన్నాళ్లు సీక్రెట్‌గా లవ్ చేసుకున్న ఈ జంట గతేడాది పెళ్లి కూడా చేసుకున్నారు.

ఇక మ్యారేజ్ తర్వాత భర్తతో వేకెషన్స్‌కి వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అయితే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ ‘మిస్ పర్‌ఫెక్ట్’(Miss Perfect) అనే వెబ్ సిరీస్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే మూవీలో నటిస్తోంది. అయితే రీసెంట్‌గా ఈ చిన్నది తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ అమ్మడు బేబీ బంప్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా లావణ్య తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. అందులో మాల్దీవ్స్ వేకేషన్స్‌కు వెళ్లిన ఈ బ్యూటీ తన భర్తతో దిగిన క్యూట్ ఫొటోను షేర్ చేసింది. అయితే ఆ పిక్‌లో లావణ్య బేబీ బంప్ కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. సో క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story