- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీలో లావణ్య త్రిపాఠి.. రిలీజ్ ఎప్పుడంటే?
డిఫరెంట్ జానర్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు కోలీవుడ్ హీరో అథర్వా మురళీ.

దిశ, సినిమా: డిఫరెంట్ జానర్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు కోలీవుడ్ హీరో అథర్వా మురళీ. ఆయన నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీ ‘టన్నెల్’. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా.. అశ్విన్ కాకుమాను విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను తెలుగులో ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో అథర్వా మురళీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. క్రూరమైన హత్యలు, వాటి వెనుకున్న సైకోని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? సమాజాన్నే తన కుటుంబం అనుకునే పోలీస్ చివరకు ఆ సైకోని పట్టుకున్నారా? లేదా? అన్న అంశాలతో ఆసక్తికరంగా, గ్రిప్పింగ్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో సాగే ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.






