Kamal Haasan: ఫైనల్‌గా పట్టాలెక్కిన KH237.. ఒక్క ఫొటోతో ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |

కమల్ హాసన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు.

Kamal Haasan: ఫైనల్‌గా పట్టాలెక్కిన KH237.. ఒక్క ఫొటోతో ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. KH237 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందబోతున్న ఈ మూవీకి స్టంట్ కొరియోగ్రాఫర్స్ నుంచి దర్శకులుగా మారిన అన్బరివ్ మాస్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హై ఆక్టేన్ యాక్షన్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆగస్టు నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు ఇదివరకే ప్రకటించగా.. ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఉందో లేదో అనే డైలామాలో పడ్డారు కమల్ ఫ్యాన్స్.

ఫైనల్‌గా ఈ సినిమా షూటింగ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. రచయిత్ శ్యామ్ పుష్కరన్ తాజాగా KH237 బృందంలో చేరినట్లు అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుండగా త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు టీమ్ అనౌన్స్ చేయగా.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ రచయిత శ్యామ్ పుష్కరన్, డైరెక్టర్ అన్బరివ్ మాస్టర్స్‌తో కమల్ హాసన్ దిగిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. లింక్


Next Story