- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగ్ 100వ చిత్రం కోసం సరికొత్త టెక్నాలజీ.. 25 నుండి 60 ఏళ్ల వరకు
25 నుంచి 60 ఏళ్ల వరకు అనేక రకాలుగా నాగ్ లుక్స్… 100వ మూవీపై భారీ అంచనాలు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి టబుతో పాటు యంగ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కనిపించనున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎవరూ ఉపయోగించని ఆధునిక టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో నాగార్జున 25 ఏళ్ల యువకుడి నుంచి 60 ఏళ్ల వ్యక్తిగా వివిధ వయసుల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విభిన్న వయసుల లుక్స్‌ను సహజంగా చూపించేందుకు మూవీ బృందం డీ-ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ టెక్నాలజీ విస్తృతంగా వినియోగించని నేపథ్యంలో, ఈ సినిమా కొత్త స్టాండర్డ్స్‌ను సెట్ చేసే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దర్శకుడు ఆర్. కార్తిక్ తెరకెక్కిస్తున్నారు.






