పిల్ల‌ల‌ను క‌నొద్దు, తిప్ప‌లు ప‌డొద్దు...మంచు ల‌క్ష్మి షాకింగ్ కామెంట్స్‌

by velandi.Saikiran |   (  Updated:2025-11-24 20:46:07  IST  )

మంచు ల‌క్ష్మి ( Lakshmi Manchu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు కూతురుగా

పిల్ల‌ల‌ను క‌నొద్దు, తిప్ప‌లు ప‌డొద్దు...మంచు ల‌క్ష్మి షాకింగ్ కామెంట్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ నటి మంచు ల‌క్ష్మి ( Lakshmi Manchu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు కూతురుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మంచు లక్ష్మి, ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలు చేయడమే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా పిల్లలను కనడంపై మంచు లక్ష్మి బాంబు పేల్చారు.

పిల్లలను క‌నాల‌ని అనుకుంటే కనేయండి, కానీ ఎవరో బలవంతం చేశారని అస్సలు కనకూడదని సూచనలు చేసింది. పిల్లల విషయంలో పక్క వాళ్ళ మాటలు అస్సలు వినకూడదని తెలిపింది. ఓపిక, ఆర్థికంగా బలంగా లేకపోతే పిల్లలను అస్సలు కనకూడదని పేర్కొన్నారు మంచు లక్ష్మి. పిల్లలు పెరిగే కొద్దీ, ఒక్కరి ఆదాయం అస్సలు సరిపోదని వివరించారు. భార్యా భర్తలిద్దరూ కష్టపడితేనే పిల్లలు సంతోషంగా ఉంటారన్నారు. ఈ కాలం పిల్లలను చూస్తే భయమేస్తోందని, ఐపాడ్స్ తో పిల్లలు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కాలంలో పిల్లలను పెంచ‌డం చాలా కష్టమేనని తేల్చి చెప్పారు మంచు ల‌క్ష్మి. దీంతో ఆమె చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Next Story