LAILA: సెకండ్ సింగిల్ అప్డేట్.. ‘ఇచ్చుకుందాం బేబీ’ అంటూ హీరోని ముద్దులతో ముంచేస్తున్న బోల్డ్ బ్యూటీ

by Gugulothu.Kavitha |   (  Updated:2025-01-21 11:07:48  IST  )

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘లైలా’(Laila). ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్(SMT Archana Presents) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.

LAILA: సెకండ్ సింగిల్ అప్డేట్..  ‘ఇచ్చుకుందాం బేబీ’ అంటూ హీరోని ముద్దులతో ముంచేస్తున్న బోల్డ్ బ్యూటీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘లైలా’(Laila). ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్(SMT Archana Presents) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ ‘లైలా’ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను రెట్టింపు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్‌ ‘ఇచ్చుకుందా బేబీ’(Ichchukundham Baby)కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ సాంగ్ జనవరి 23న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఓ బోల్డ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. హీరోయిన్ ఆకాంక్ష శర్మ బికినీ వేసుకుని విశ్వక్ సేన్‌ హార్ట్‌పై చేయి వేసి బుగ్గపై ముద్దులతో ముంచేస్తుంది. ఇక హీరో మాత్రం ఆ కిస్‌ను ఎంజాయ్ చేస్తూ ఎటో చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Next Story