Laila Issue : లైలా వివాదం.. మళ్ళీ బూతులతో రెచ్చిపోయిన పృధ్వీ

by Muthe.Rajitha |   (  Updated:2025-02-12 12:11:33  IST  )

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishvaksen) "లైలా"(Laila) చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే.

Laila Issue : లైలా వివాదం.. మళ్ళీ బూతులతో రెచ్చిపోయిన పృధ్వీ
X

దిశ, వెబ్ డెస్క్ : మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishvaksen) "లైలా"(Laila) చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృధ్వీరాజ్(Actor Prudhviraj) చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దూమరాన్ని రేపాయి. పృధ్వీ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీని ఉద్దేశించే అని వైసీపీ(YCP) వర్గీయులు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ లైలా(boycottliala) అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా ఫిబ్రవరి 14న విడుదల అవనున్న ఈ సినిమా HD ప్రింట్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై విశ్వక్ సేన్, నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ అడిగిన తర్వాత కూడా ట్రోలింగ్ ఆగలేదు.

ఇక నటుడు పృధ్వీకి అసంఖ్యాక బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆసుపత్రి బెడ్ మీది నుంచే మీడియాతో మాట్లాడిన పృధ్వీ.. మరోసారి బూతులతో రెచ్చిపోయారు. వైసీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. 11 అనే మాట వస్తేనే వైసీపీ వాళ్ళు గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. నా తల్లిని నీచంగా తిడుతున్నారని, తను బతికి ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే ఒక్కరిని నరికి వేసేవాడిని అంటూ.. చెప్పలేని బూతులకు దిగారు. మరోవైపు పృధ్వీ భార్య సారీ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. దమ్ముంటే ట్రోలర్స్ ముందుకు రావాలని సవాల్ విసిరారు. చూస్తుంటే ఈ వివాదం ఇంతటితో ఆగేలా లేదు అనిపిస్తోంది. పృధ్వీ, వైసీపీ మధ్య 'లైలా' నలిగిపోతోంది పాపం.

అయితే సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడిగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ గతంలో వైసీపీ(YCP)కి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది. దీంతో వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేసి జనసేన(Janasena)కు దగ్గరైన పృథ్వీరాజ్ మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశారు. ఇక ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమా ఫంక్షన్ లో అయినా సరే వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్న ఆయన తాజాగా లైలా ఈవెంట్లో వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు.

Next Story