#boycottlaila : లైలా బాయ్ కాట్ వివాదం.. ఆసుపత్రి పాలైన నటుడు

by Muthe.Rajitha |   (  Updated:2025-02-12 12:23:42  IST  )

#boycottlaila : లైలా బాయ్ కాట్ వివాదం.. ఆసుపత్రి పాలైన నటుడు
X

దిశ, వెబ్ డెస్క్ : మాస్ కా దాస్ విశ్వక్ సేన్(VishvakSen) తాజా 'లైలా'(Laila) చిత్రం వివాదంలో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లో న‌టుడు పృథ్వీరాజ్(PrudhviRaj) చేసిన వ్యాఖ్యలు ఒక రాజకీయ వ‌ర్గానికి కోపం తెప్పించ‌డంతో సోష‌ల్ మీడియాలో హ్యాష్ టాగ్ బాయ్‌కాట్ 'లైలా'(#boycottlaila) ట్రెండ్ నడుస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటం.. బాయ్ కాట్ వ్యవహారం ఇంకా ముదురుతుండటంతో.. మొత్తం ఈ వివాదానికి కారణమైన నటుడు పృధ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. హైబీపీతో ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడిగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ గతంలో వైసీపీ(YCP)కి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది. దీంతో వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేసి జనసేన(Janasena)కు దగ్గరైన పృథ్వీరాజ్ మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశారు. ఇక ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమా ఫంక్షన్ లో అయినా సరే వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్న ఆయన తాజాగా లైలా ఈవెంట్లో వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ సంచలన కామెంట్స్ చేశారు.

దీంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలని #boycottlaila అంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పృధ్వీ మాట్లాడిన మాటలకు తమకు సంబంధం లేదని హీరో విశ్వక్ సేన్ తోపాటు నిర్మాత కూడా మీడియా ముందుకు వచ్చారు. అయితే రోజురోజుకీ ఈ వివాదం ముదురుతుండటంతో.. పృథ్వీరాజ్ హాస్పిటల్ పాలైనట్లు సమాచారం. ఆయనకు హై బీపీ రావడంతో హుటాహుటిన సన్నిహితులు ఆయనని ఆసుపత్రికి తరలించారు. పృధ్వీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విజువల్స్ సహా కొన్ని ఫోటోలు బయటకు రాగా.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Next Story