Chiranjeevi: చిరంజీవి ‘మెగా-157’ సినిమాలో లేడీ సూపర్ స్టార్.. హైప్ పెంచుతున్న ట్వీట్

by Mallepaka Hamsa |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’(Vishvambhara).

Chiranjeevi: చిరంజీవి ‘మెగా-157’ సినిమాలో లేడీ సూపర్ స్టార్.. హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’(Vishvambhara). వశిష్ట(Vasishta) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. సోసియో-ఫాంటసీ ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ఎం. ఎం. కీరవాణి వ్యవహరిస్తున్నారు. అయితే ఇందులో త్రిష(Trisha), ఆషిక రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే9న థియేటర్స్‌లోకి రాబోతుంది.

దీంతో పాటు చిరు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. మెగా-157 వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు నయనతార ఏ రోల్ చేయనుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story