- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vyjayanthi banner: వైజయంతి బ్యానర్‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీ.. హీరోయిన్ ఎవరంటే?
ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లో వైజయంతీ మూవీస్ ఒకటి.

దిశ, సినిమా: ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లో వైజయంతీ మూవీస్ ఒకటి. ఇప్పుడు ఈ బ్యానర్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా.. ఈ చిత్రానికి ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. అయితే.. ఈ ఓరియెంటెడ్ మూవీలో ప్రధాన పాత్రలో నటించేందుకు ఇద్దరు హీరోయిన్స్ పేరు గట్టిగా వినిపిస్తుంది.
అందులో ఒకటి శ్రీలీల, రెండోది భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం శ్రీలీల ‘మాస్ జాతర’ చిత్రంతో బిజీగా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుండగా.. ప్రజెంట్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది శ్రీలీల. అలాగే.. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్య శ్రీ బోర్సే.. ఈ ఏడాది కింగ్‌డమ్ చిత్రంతో వచ్చి అలరించింది. ఈ ఓరియెంటెడ్ మూవీకి శ్రీలీల అండ్ భాగ్యశ్రీ బోర్సే పేర్లు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తుండగా.. మరి వైజయంతీ మూవీస్ బ్యానర్ ఎవరితో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుందనేది ఆసక్తికంగా మారింది. ఇక ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ రాబోయే రోజుల్లో ఈ సినిమాపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. లింక్






