ఏకంగా 13 ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. చరిత్ర సృష్టించిన సినిమా..

by Sujitha Rachapalli |

అమీర్ ఖాన్ నిర్మించిన ‘లాపతా లేడీస్’ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో చరిత్ర సృష్టించింది. ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏకంగా పదమూడు అవార్డులు గెలుచుకుని ‘గల్లీ బాయ్’ సరసన నిలిచింది. బెస్ట్ మూవీ,

ఏకంగా 13 ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. చరిత్ర సృష్టించిన సినిమా..
X

దిశ, వెబ్ డెస్క్ : అమీర్ ఖాన్ నిర్మించిన ‘లాపతా లేడీస్’ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో చరిత్ర సృష్టించింది. ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏకంగా పదమూడు అవార్డులు గెలుచుకుని ‘గల్లీ బాయ్’ సరసన నిలిచింది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరోయిన్ క్రిటిక్స్, బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌తో సహా అనేక విభాగాల్లో సత్తా చాటింది.

నిజానికి ఈ చిత్రం వెండితెరపై సరిగ్గా వర్క్ చేయలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలు అవార్డు ఫంక్షన్స్‌లో స్పెషల్ అప్లాజ్ పొందింది. ఓటీటీలోనూ దుమ్ములేపింది. రూ. 5కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 27.06 కోట్లు మాత్రమే వసూల్ చేయగలిగింది. కానీ ఫిల్మ్ ఫేర్‌లో సత్తాచాటింది.

* ఉత్తమ దర్శకుడు: కిరణ్ రావు

* ఉత్తమ చిత్రం - లాపతా లేడీస్

* ఉత్తమ నటి(క్రిటిక్స్) - ప్రతిభా రంతా

* ఉత్తమ డెబ్యూ ఫిమేల్ : నితాశి గోయల్

* ఉత్తమ సహాయ పాత్ర (మహిళ) - ఛాయా కదమ్

* ఉత్తమ సహాయ పాత్ర (పురుషుడు) - రవి కిషన్

* ఉత్తమ నేపథ్య గాయకుడు - అరిజిత్ సింగ్ (సజ్ని)

* ఉత్తమ డైలాగ్ - స్నేహా దేశాయ్

* ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - రామ్ సంపత్

* ఉత్తమ సాహిత్యం - ప్రశాంత్ పాండే

* ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - రామ్ సంపత్

* ఉత్తమ కాస్ట్యూమ్ - దర్శన్ జలాన్

* ఉత్తమ స్క్రీన్ ప్లే - స్నేహా దేశాయ్

Next Story