- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘L2: ఎంపురాన్’ వివాదం.. చేతులెత్తి దండం పెడుతూ మోహన్‌లాల్ ఆసక్తికర పోస్ట్
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) నటించిన లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’(L2: Empuran). ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) దర్శకత్వం వహించారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) నటించిన లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’(L2: Empuran). ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఇందులో కీలక పాత్రలో నటించారు. అయితే దీనిని శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) బ్యానర్లపై ఈ సినిమాను గోకుళం గోపాలం, ఆంటోనీ పెరుంబవూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా వచ్చింది. అయితే మార్చి 27న థియేటర్స్‌లోకి వచ్చిన ‘L2: ఎంపురాన్’మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై వారం కూడా కాకముందే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. అదే విధంగా ‘ఎంపురాన్-2’ మూవీపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ చిత్రం విషయంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఆధారం పన్ను శాఖ నుంచి నోటీసులు కూడా జారీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఇప్పటికే ఈ వివాదంపై మోహన్‌లాల్ స్పందించి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా, మోహన్‌లాల్ ట్విట్టర్ ద్వారా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెడుతూ షాకింగ్ ఫొటో షేర్ చేశారు. ‘L2: ఎంపురాన్’ ఇప్పుడు మలయాళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రాజ్యమేలుతోంది. కొత్త పరిశ్రమ బెంచ్‌మార్క్. ఈ క్షణం మాకు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి ఆనందానికి కారణం అవుతుంది. మీకు సమీపంలోని థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది’’ అని రాసుకొచ్చారు. అలాగే చేతులెత్తి దండం పెడుతున్న ఫొటోను షేర్ చేశాడు. అయితే మోహన్‌లాల్ ఆ పిక్‌ను ‘ఎంపురాన్’ వివాదం వదిలేయాలనే పెట్టాడని అంతా చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలోనే ‘ఎంపురాన్’ అత్యధిక వసూళ్లు సాధించడం గురించి తెలుసుకుని షాక్ అవుతున్నారు.
#L2E #Empuraan now reigns as the highest-grossing film in Malayalam cinema history.
— Mohanlal (@Mohanlal) April 5, 2025
The new industry benchmark.
This moment belongs not just to us but to every heartbeat that echoed in theatres, to every cheer, every tear, to you.
Running successfully in theatres near you. pic.twitter.com/9UldhKybvd






