మద్యం మత్తులో ఒక్కరోజు చేసిన తప్పు.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. అబార్షన్ చేయించుకున్నా.. నటి సంచలనం

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-22 13:00:17  IST  )

మద్యం మత్తులో ఒక్కరోజు చేసిన తప్పు.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. అబార్షన్ చేయించుకున్నా.. నటి సంచలనం
X

దిశ, వెబ్ డెస్క్ : బోల్డ్ బ్యూటీ కుబ్రా సైత్ ప్రతి విషయాన్ని ఓపెన్‌గా మాట్లాడేస్తుంది. ప్రైవేట్‌గా ఉంచాల్సిన విషయాలను కూడా పబ్లిక్‌గా చెప్పేస్తుంది. ఈ క్రమంలోనే తను రాసిన ‘ ఓపెన్ బుక్ : నాట్ క్వైట్ ఎ మెమోయిర్ ’లో వన్ నైట్ స్టాండ్ గురించి ప్రస్తావించింది. తన పుట్టిన రోజున అండమాన్ దీవులకు వెకేషన్ వెళ్లామని.. పార్టీలో మద్యం సేవించాక.. ఫ్రెండ్‌తో ఒక్కరోజు రాత్రి సన్నిహితంగా గడిపినట్లు చెప్పింది. దీంతో తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని.. కానీ తాను అబార్షన్ చేయించుకున్నానని చెప్పింది. ఈ ఘటన తర్వాత తనకు తాను భయంకరమైన మనిషిగా అనిపించిందని.. ఇప్పుడు మాత్రం ఎలాంటి రిగ్రెట్స్ లేవని తెలిపింది. ఎందుకంటే తాను తల్లిగా మారేందుకు సిద్ధంగా లేనని చెప్పింది. 23ఏళ్లకు పెళ్లి.. 30 ఏళ్లకు బిడ్డను కనాలనే టైప్ కాదని.. ఇది తన నిర్ణయమని.. పవర్‌ఫుల్‌గా చాయిస్‌గా భావిస్తున్నట్లు రాసుకొచ్చింది.

Next Story