- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుబేర ట్రైలర్ వచ్చేసింది.. సరస్వతి దేవి కూడా తలెత్తుకోవాల్సిందే !
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, తమిళ్ హీరో ధనుష్ , హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలతో వస్తున్న లేటెస్ట్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, తమిళ్ హీరో ధనుష్ , హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలతో వస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర (Kuberaa). ఈ సినిమాను... దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు అలాగే టీజర్లు.. సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇక కాసేపటి క్రితమే కుబేర ట్రైలర్ ( Kuberaa Trailer) కూడా లాంచ్ అయింది.
ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి.. కుబేర సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లో రష్మిక, అక్కినేని నాగార్జున, హీరో ధనుష్ ప్రధాన పాత్రలలో కనిపించారు. ఈ ముగ్గురు చుట్టే కథ నడుస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీరో ధనుష్ బిచ్చగాడి పాత్ర అని.. అతనికి అక్కినేని నాగార్జున హెల్ప్ చేస్తాడని తెలుస్తోంది. అలాగే రష్మిక మందనాతో... హీరో ధనుష్ పాత్ర ఎక్కువసేపు ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ముఖ్యంగా డబ్బుల చుట్టే ఈ సినిమా తిరుగుతుందని... దానికి తగ్గట్టుగానే కుబేర... అనే టైటిల్ పెట్టినట్లు మనకు స్పష్టం అవుతుంది. అటు ట్రైలర్ లో బిజిఎం అదరగొట్టారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా ఈ నెల 20వ తేదీన థియేటర్ లోకి రాబోతుంది. కాగా కుబేర మూవీతో సరస్వతీ దేవి తల ఎత్తుకు అంటుందని దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.






