Kuberaa: కుబేర సరికొత్త రికార్డు.. రూ.100 కోట్లు క్రాస్ !

by velandi.Saikiran |   (  Updated:2025-06-25 09:18:15  IST  )

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ( Nagarjuna), తమిళ్ హీరో ధనుష్, రష్మిక ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబ

Kuberaa: కుబేర సరికొత్త రికార్డు.. రూ.100 కోట్లు క్రాస్ !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ( Nagarjuna), తమిళ్ హీరో ధనుష్, రష్మిక ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేర. డబ్బులు చుట్టూ నడిచే... ఈ కథను రూపొందించింది శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయి... పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొన్న శుక్రవారం రిలీజ్ అయిన కుబేర సినిమాను చూసేందుకు జనాలు ఇవ్వబడుతున్నారు.

ఫ్యామిలీ కూడా చూసేలా సినిమా ఉండడంతో.. అన్ని థియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందానికి కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు చెబుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి 100 కోట్లు రాబట్టిందట కుబేర సినిమా. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సినిమా కథ బాగుండడంతో... జనాలు ఎగబడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఈ సినిమాకు పోటీగా థియేటర్లలో ఏ సినిమా కూడా లేదు. అది కూడా శేఖర్ కమ్ముల సినిమాకు ప్లస్ అయింది. సినిమా మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే... 200 కోట్లు కూడా దాటుతుందని చెబుతున్నారు విశ్లేషకులు.

Next Story