- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Krrish 4: హృతిక్ నిర్ణయం వల్లే సినిమా వెనక్కి వెళ్లిందా?
హృతిక్ రోషన్ 'క్రిష్ 4' మూవీ కంటే ముందు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో ఓ సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. దాంతో సౌత్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా కంప్లీట్ చేసి ఆ తర్వాత క్రిష్ 4 మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: 'హృతిక్ రోషన్'కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును తీసుకువచ్చిన చిత్రాలలో క్రిష్ సిరీస్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుండి మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. అందులో మొదటి రెండు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. మూడవ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయినా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. క్రిష్ 3 విడుదల అయిన తర్వాత నుండే హృతిక్ 'క్రిష్ 4'పై చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాడు అని, త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేస్తాడు అని అనేక సార్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాను మాత్రం మొదలు పెట్టలేదు. ఎట్టకేలకు కొన్ని రోజుల క్రితం ఈ సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దానితో ఈసారైనా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అని చాలామంది అనుకున్నారు.
కానీ ప్రస్తుతానికి ఈ సినిమా పనులను పక్కనపెట్టి ఓ సౌత్ ప్రొడక్షన్ హౌస్లో సినిమా చేయడానికి ఈ నటుడు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో ఓ సినిమాకు ఈ హీరో కమిట్ అయినట్లు, క్రిష్ 4 సినిమాకు సంబంధించిన కథ ఇంకా ఫైనల్ కాలేదు అని, దానితో సౌత్ బ్యానర్లో ఓ సినిమా చేసి ఆ తర్వాత క్రిష్ 4ను స్టార్ట్ చేసే ఆలోచనలో హృతిక్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ బాలీవుడ్ నటుడు నెక్స్ట్ ఏ మూవీతో ప్రేక్షకులను పలకరిస్తారో చూడాలి. హృతిక్ కొంతకాలం క్రితమే వార్ 2 అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.






