- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను నమ్మి ప్రతిసారీ నాకు ఏదో ఒక కొత్తదనాన్ని, విచిత్రమైనదాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు: kritisanon
కృతి సనన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: కృతి సనన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తొలి మూవీతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల వద్ద ప్రశంసలు అందుకుంది. అటు హిందీలో కూడా జాకీ ష్రాప్ కుమారుడు టైగర్ ష్రాప్ కుమారుడు ష్రాప్ జంటగా హీరోపంతి చిత్రంలో నటించి మెప్పించింది.
బాలీవుడ్‌లో ఈ హీరోయిన్ మొదటి సినిమా. తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఈమె దిల్ వాటే, దోచేయ్, బరేలీ బర్ఫీ, కలంక్ లుకా చుప్పి, హౌస్ ఫుల్ 4, అర్జున్ పాటియాలా, పతి పత్నీ ఔర్ వో, పానిపట్, హమ్ దో హమారే దో, బచ్చన్ పాండే వంటి సినిమాల్లో నటించి నెటిజన్లను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ నటి సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పంచుకుంది. ‘‘ది డ్రీమ్ అండ్ ది డ్రీమర్ అని మొదలుపెట్టి.. తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా చిత్రానికి ఉత్తమ నటిగా
ఈ గుర్తింపుకు @zeecineawards ధన్యవాదాలు. #Dinoo @maddockfilms నన్ను ఎల్లప్పుడూ నమ్మి, ప్రతిసారీ నాకు ఏదో ఒక కొత్తదనాన్ని, విచిత్రమైనదాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అమిత్ & ఆరాధన - నా అత్యంత ప్రత్యేకమైన పాత్ర SIFRAని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను.
ఎప్పటికప్పుడు ఉత్తమ నిర్వాహకుడిగా ఉన్నందుకు @shahidkapoor మీతో కలిసి పనిచేయడంలో ఉత్తమ సమయం గడిపాను. మీరు ప్రతిదీ తీక్ హై అనిపించేలా చేశారు. pvijan అండ్ @sharadakarki ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన రెండు స్తంభాలు.. నా రాక్‌స్టార్స్. ఇంత అందమైన అనుభవాన్ని అందించిన డింపుల్ మేడమ్, ధర్మేంద్ర సర్, TBMAUJ తారాగణం, సిబ్బంది అందరికీ చాలా ధన్యవాదాలు’’. అంటూ రాసుకొచ్చింది.






