మెగా హీరోతో పెళ్లి.. స్పందించిన కృతి శెట్టి టీమ్!

by Disha Web Desk 6 |
మెగా హీరోతో పెళ్లి.. స్పందించిన కృతి శెట్టి టీమ్!
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ కృతి సనన్ ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే మంచి విజయం సాధించింది. దీంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత పలు మూవీస్‌లో నటించి మెప్పించింది. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

అయితే ఈ అమ్మడు మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో ప్రేమలో ఉన్నట్లు పెళ్లి కూడా చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, దీనిపై కృతి శెట్టి టీమ్ స్పందించింది. ‘‘ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. కావాలని కొంతమంది ఇటు వంటి ప్రచారాలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. అటువంటి అన్నీ పుకార్లే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశం కృతికి లేదు. ఆమె ప్రస్తుతానికి సినిమాలకే తన ప్రాధాన్యత ఇస్తుంది’’ అంటూ కృతి శెట్టి టీం చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed