Kriti Shetty: మోడ్రన్ లుక్‌తో అభిమానులను ఫిదా చేస్తున్న బ్యూటీ

by Pulgam srinivas |

డార్క్ గ్రీన్ కలర్ ఆఫ్-షోల్డర్ గౌన్‌లో మోడ్రన్ లుక్‌తో అభిమానులను ఫిదా చేస్తున్న కృతి శెట్టి.

Kriti Shetty: మోడ్రన్ లుక్‌తో అభిమానులను ఫిదా చేస్తున్న బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి చిత్రంతోనే అదిరిపోయే స్థాయి విజయాన్ని సాధించి, మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.




ఆ తర్వాత ఈమె నటించిన పలు చిత్రాలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో, ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుందని చాలామంది అంచనా వేశారు. కానీ ఆ తర్వాత కృతి శెట్టి నటించిన కొన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో, ఈమె క్రేజ్ కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది.




ప్రస్తుతం ఈ చిన్నది తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలలో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మలయాళం, తమిళ చిత్రాలలో కూడా నటించింది. మరికొన్ని రోజుల్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.




ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్‌కు జోడిగా కృతి శెట్టి ఎంపికైనట్లు సమాచారం. ఈ అవకాశాన్ని కృతి శెట్టి అందుకుంటే, అది ఆమె కెరీర్‌కు గోల్డెన్ ఆఫర్‌గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.




తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈమె డార్క్ గ్రీన్ కలర్ ఆఫ్-షోల్డర్ గౌన్ ధరించి, మెడలో గోల్డ్ నెక్లెస్, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, చేతికి బ్రేస్‌లెట్ ధరించి స్టైలిష్‌గా ఫోజులు ఇచ్చింది.




ఈ ఫోటోలలో కృతి శెట్టి నలుపు రంగు కురులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ, తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పిక్స్‌లో ఆమె తన ఎద అందాలతో ఆకట్టుకుంది. దాంతో ఈ స్టిల్స్ సోషల్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story