తెలుగు హీరోయిన్లకు తమిళ దెబ్బ

by Pulgam srinivas |

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న కృతి శెట్టి, శ్రీలీల ఈ మధ్యకాలంలో తమిళ సినిమాల ద్వారా ప్లాప్స్ అందుకున్నారు.

తెలుగు హీరోయిన్లకు తమిళ దెబ్బ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చిన హీరోయిన్లు కోలీవుడ్లోకి, అక్కడ మంచి క్రేజ్ సంపాదించుకున్న వారు మన తెలుగులోకి రావడం అనేది అనేక సంవత్సరాలుగా జరుగుతోంది. ఇక్కడ, అక్కడ ఏకకాలంలో స్టార్ హీరోయిన్లుగా చక్రం తిప్పిన వారు కూడా అనేకమంది ఉన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన హీరోయిన్లుగా కొనసాగుతున్న ఇద్దరు ముద్దుగుమ్మలకు కోలీవుడ్ సినిమాల ద్వారా గట్టి షాక్ తగిలింది. ఇంతకు ఆ ఇద్దరు యంగ్ హీరోయిన్లు ఎవరు అనుకుంటున్నారా? వారు మరెవరో కాదు కృతి శెట్టి, శ్రీలీల.

కృతి శెట్టి 'ఉప్పెన' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ విజయాన్ని, అంతకుమించిన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస పెట్టి చాలా సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. కానీ ఈమెకు చాలా కాలం నుండి సరైన విజయాలు లేవు. దాంతో ఈ బ్యూటీ తెలుగుతోపాటు ఇతర భాష సినిమాలపై కూడా ఆసక్తి చూపించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా కృతి, కార్తీ హీరోగా నటించిన వా వాతియ‌ర్ అనే తమిళ సినిమాలో నటించింది.

కొన్ని రోజుల క్రితం మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. దానితో ఈమెకు తమిళ ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న శ్రీలీల 'పరాశక్తి' అనే తమిళ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ఇద్దరు బ్యూటీలకు రీసెంట్ టైంలో తమిళ సినిమాల ద్వారా గట్టి దెబ్బ తగిలింది. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరూ కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయాలను అందుకొని మంచి స్థాయికి వెళ్తారేమో చూడాలి.

Next Story