- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేష్ బాబు పెద్ద స్టార్ హీరో అని నాకు తెలీదు..హీరోయిన్ సంచలనం!
కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు.. అగ్ర హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ ఇలా అన్ని కథలు చేసి, తెలుగుపేక్షకులకు బాగా దగ్గరయ్యారు మహేష్ బాబు. ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. ఇప్పటికీ అతని హవా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పుడు వారణాసితో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు మమేష్. అయితే అలాంటి అగ్ర హీరో ప్రిన్స్ మహేష్ బాబు పై బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో బాలీవుడ్ సినిమాలు నేను చూశాను..కానీ మహేష్ బాబు ఇంత పెద్ద స్టార్ హీరో అని తనకు తెలియదంటూ బాంబు పేల్చారు. మహేష్ బాబు, కృతి సనన్ కాంబినేషన్ లో 1 - నేనొక్కడినే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేయగా కృతి సనన్ ( Kriti Sanon) హీరోయిన్ గా నటించారు. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించారు. 2014 సమయంలో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమా చేసేటప్పుడు మహేష్ బాబు పెద్ద స్టార్ హీరో అని తనకు తెలియదంటూ తాజాగా కృతి సనన్ వెల్లడించారు.
కానీ ఆ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఇతర నటీ నటుల ద్వారా అతని క్రేజ్ తెలుసుకున్నట్లు వివరించారు. ఆ తర్వాత మహేష్ బాబు క్రేజ్ ఏంటో తనకు పూర్తిగా అర్థమైందని వ్యాఖ్యానించారు. అటు దర్శకుడు సుకుమార్ కూడా చాలా మంచి వాళ్ళని, అతని సినిమాలో అవకాశం వస్తే మళ్లీ చేస్తానన్నారు. దీంతో కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ హీరోని పట్టుకొని, తెలియదు అంటావా ? అని మండిపడుతున్నారు. హిందీ సినిమాలు చూస్తే, మహేష్ గురించి తెలుస్తుందా? అని నిలదీస్తున్నారు. క్లిక్






