మా రెమ్యునరేషన్‌ను తగ్గిస్తున్నారు..స్టార్ హీరోయిన్ సీరియ‌స్ !

by velandi.Saikiran |

మా రెమ్యునరేషన్‌ను తగ్గిస్తున్నారని..స్టార్ హీరోయిన్ కృతి స‌న‌న్ సీరియ‌స్ అయ్యారు.

మా రెమ్యునరేషన్‌ను తగ్గిస్తున్నారు..స్టార్ హీరోయిన్ సీరియ‌స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో కృతి సనన్ ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసిన ఈ అందాల తార.. తెలుగులో కూడా పెద్ద హీరోల సరసన చేసింది. నెంబర్ వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార కృతి సనన్, ఆది పురుష్‌ సినిమాలో సీత పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. అయితే అలాంటి కృతి సనన్... రెమ్యూనరేషన్ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హీరోల గురించి ఎవ‌రు మాట్లాడ‌టం లేదు

సినిమా బడ్జెట్ అదుపులో ఉంచే క్రమంలో ముందుగా హీరోయిన్ల రెమ్యూనరేషన్ కట్ చేస్తున్నారని నిర్మాతలపై అసహనం వ్యక్తం చేశారు కృతి సనన్. ముఖ్యంగా మిడ్ రేంజ్ హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లలో కోత విధిస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే హీరోల రెమ్యూనరేషన్ పైన చర్చ జరగడం లేదని మండిపడ్డారు. దర్శక, నిర్మాతలలో ఒక వర్గం మాత్రం టాప్ హీరోలే రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని ఆశిస్తున్నారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు.

Next Story