- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా తల్లిదండ్రులు వద్దు అన్నారనే లస్ట్ స్టోరీస్‌లో నేను నటించలేదు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ లస్ట్ స్టోరీస్
బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కి సూపర్ సక్సెస్ అందుకున్న వాటిలో ‘లస్ట్ స్టోరీస్’ (Lust Stories) ఒకటి.

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కి సూపర్ సక్సెస్ అందుకున్న వాటిలో ‘లస్ట్ స్టోరీస్’ (Lust Stories) ఒకటి. అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్ దర్శతక్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో రాధికా ఆప్టే, భూవీ పెడ్నేకర్, నీల్ భూపాలం, మనీషా కోయిరాలా, కియారా అద్వానీ, విక్కీ కౌశల్, ఆకాష్ తోసర్, నేహా ధూపియా ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. లస్ట్ స్టోరీస్-2 కూడా వచ్చిన విషయం తెలిసిందే.
అయితే.. లస్ట్ స్టోరీస్‌లో కియారా అద్వానీ ప్లేస్‌లో మొదట కృతి సనన్‌ను అనుకున్నారట. కానీ ఆమె రిజెక్ట్ చేసిందట. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ఈ విషయంపై స్పందిస్తూ.. ‘లస్ట్ స్టోరీస్‌లో కియారాఅద్వానీ పాత్రను నేను తిరస్కరించాను. ఎందుకంటే నేను అలాంటి పాత్రలో నటించడం నా తల్లిదండ్రులకు నచ్చలేదు. ఇక వారు వద్దు అని చెప్పడంతో.. నేను ఆ అవకాశాన్ని వదులుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి కామెంట్స్ వైరల్ అవుతుండగా.. స్క్రిప్ట్ విషయంలో ఇప్పటికే తల్లిదండ్రులు మాట వింటుందా అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.






