Kriti Kharbanda: బ్రౌనిష్-గ్రే బాడీకాన్ గౌన్‌లో మెరిసిన అందాల తార

by Pulgam srinivas |

బ్రౌనిష్-గ్రే కలర్ బాడీకాన్ టైట్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఆకట్టుకున్న కృతి కర్బంద.

Kriti Kharbanda: బ్రౌనిష్-గ్రే బాడీకాన్ గౌన్‌లో మెరిసిన అందాల తార
X

దిశ, వెబ్ డెస్క్: నటి కృతి కర్బంద కన్నడ చిత్రాల ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈమె తెలుగు సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన తీన్‌మార్ సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపును సంపాదించింది.



అలాగే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్రూస్ లీ సినిమాలో ఆయనకు అక్క పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలతో పాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.




అయితే ఈ మధ్యకాలంలో ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎక్కువగా పలకరించకపోయినా, సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ తన అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది.




తనకు సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటూ వారిని అలరిస్తోంది. అలాగే అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటూ ఉంటుంది.




తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ హాట్ లుక్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ బ్యూటీ బ్రౌనిష్-గ్రే కలర్ బాడీకాన్ టైట్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెరిసింది. ఈ ముద్దుగుమ్మ వేసుకున్న పొడవాటి గౌను, లూజ్ హెయిర్ ఆమె అందాన్ని మరింత పెంచాయి. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story