- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Krithi Shetty: మరో సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసిన కృతి శెట్టి.. నీకు సెట్ కాదులే అంటున్న నెటిజన్లు
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది కృతి శెట్టి.

దిశ, సినిమా: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది కృతి శెట్టి. డెబ్యూ మూవీ ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. రీసెంట్‌గా కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ఇక రీసెంట్‌గా బాలీవుడ్‌లో కూడా ఓ ఆఫర్ రావడంతో.. అక్కడ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద కుమారుడు యశ్వర్ధన్ అహుజా డెబ్యూ మూవీతోనే కృతి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని, దీనికి సాజిద్ ఖాన్ దర్శకత్వం చేస్తారంటూ వార్తలు వినిపించాయి.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని టాక్ వచ్చింది. అయితే ఏమైందో ఏమో కానీ.. యశ్వర్ధన్ అహుజా సరసన నటించాల్సిన మూవీ నుంచి హీరోయిన్‌గా కృతి శెట్టి తప్పుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి, గతంలో కూడా కృతి ‘బేబీ’ హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా దాదాపు ఖరారైంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి ఆమె బాలీవుడ్ మూవీ నుంచి తప్పుకోవడంతో.. కృతికి బాలీవుడ్ సెట్ కాదు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






