- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోట శ్రీనివాసరావు చివరి సినిమా ‘హరిహర వీరమల్లు’!
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దాదాపు 40 ఏళ్ల పాటు వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన మృతిని ఇండస్ట్రీ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కోట శ్రీనివాసరావుకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. చివరగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu)లో కోట శ్రీనివాసరావు ఓ చిన్న పాత్ర పోషించారని ఇండస్ట్రీ వర్గాలు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరో పది రోజుల్లో వీరమల్లు చిత్రం విడుదల ఉండగా.. ఇంతలో కోట శ్రీనివాసరావు మృతిచెందడం చాలా బాధాకరమైన విషయమని పేర్కొంటున్నారు.
కాగా, ఇప్పటికే అనేక పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. ముఖ్యంగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. హీరోయిన్ శృతి హాసన్ తండ్రిగా అదరగొట్టారు. పోలీస్ స్టేషన్‌లో ‘‘మందు బాబులం మేము.. మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం’’ అనే పాట సినిమాకే హైలైట్‌గా నిలించింది. ట్విట్టర్ పోస్టు






