మహా ప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు.. ఎప్పుడంటే ?

by velandi.Saikiran |

టాలీవుడ్ సీనియర్ కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా తీవ్ర

మహా ప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు.. ఎప్పుడంటే ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు... ఇవాళ ఉదయం మృతి చెందారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే.. కోట శ్రీనివాసరావు మృతి చెందిన నేపథ్యంలో.. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు.

ఇవాళ కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహా ప్రస్థానంలోనే (Maha Prasthanam ) అంత్యక్రియలు జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు కోట శ్రీనివాసరావు అంతిమయాత్ర ప్రారంభం కానుందని.. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో... మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని చెబుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం హైదరాబాద్ లోనే ఉన్నారని తెలుస్తోంది.

ఇలాంటి నేపథ్యంలోనే ఇవాళ కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా... కోట శ్రీనివాసరావు మృతి నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ పార్టీ నేతలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

Next Story