- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమాతో ‘కోట’ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు.. మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు(83)(Kota Srinivasa Rao) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు(83)(Kota Srinivasa Rao) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా శ్లోక సంద్రంలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయానికి మురళీ మోహన్(Murali Mohan) నివాళులర్పించారు.
అలాగే కోట కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘మా అందరికీ ప్రియమైన వ్యక్తి కోట శ్రీనివాసరావు. సినీ పరిశ్రమ అద్భుత నటుడిని కోల్పోయింది. ప్రతిఘటన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. కోట నేను కలిసి అనేక చిత్రాలలో కలిసి నటించాము. ఆయన విలన్ పాత్రల్లోనూ నవ్వించారు. కోట శ్రీనివాస్ మృతితో ఓ మంచి మిత్రుడిని కోల్పోయాను’ అంటూ మురళి మోహన్ చెప్పుకొచ్చాడు.






