- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన పాపులర్ నటి.. భర్త మోసం చేయడంతో బజారునపడ్డామని..
కొరియన్ నటి జియోంగ్ - గా - యూన్ ట్యాక్సీ డ్రైవర్‌గా మారింది. భర్త తన పేరుతో 80 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడగా.. ఆస్థి మొత్తం కోల్పోయింది. చేతుల్లో చిల్లి గవ్వ లేక..

దిశ, వెబ్‌డెస్క్ : కొరియన్ నటి జియోంగ్ - గా - యూన్ ట్యాక్సీ డ్రైవర్‌గా మారింది. భర్త తన పేరుతో 80 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడగా.. ఆస్థి మొత్తం కోల్పోయింది. చేతుల్లో చిల్లి గవ్వ లేక.. కుమార్తెను చూసుకునే వారు లేక.. నటనా అవకాశాలు కూడా తగ్గడంతో.. ఈ వృత్తిని ఎంచుకుంది. తన తండ్రి 30ఏళ్లకుపైగా టాక్సీ డ్రైవర్‌గా పనిచేయగా.. ఇక్కడి నుంచి స్ఫూర్తి పొందింది. దక్షిణ కొరియా టాక్సీ డ్రైవర్ అర్హత పరీక్షలో 75/100 స్కోరుతో ఉత్తీర్ణురాలైన ఆమె.. ప్రస్తుతం నెలకు ఎనిమిది వేలకు పైగా సంపాదిస్తోంది. ఈ సాడ్ స్టోరీని తన యూట్యూబ్ ఛానల్ ‘వండర్ గా యూన్’లో డాక్యుమెంట్ చేసింది.
ఆర్థిక ఇబ్బందుల్లో లేనప్పటికీ.. స్థిరమైన ఆదాయం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. ఇక ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆమె ధైర్యానికి ప్రశంసలు అందుకుంది. స్పాట్‌లైట్ నుంచి డ్రైవర్ సీటుకు గా-యూన్ ప్రయాణం.. తన కుమార్తె పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత, విజయాన్ని పునర్నిర్వచించే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. దృఢత్వానికి శక్తివంతమైన చిహ్నంగా నిలిపింది.






