- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ మధ్య కాలంలో ఇలాంటి మెలోడీ పాటను వినలేదు.. హీరో నవీన్ చంద్ర కామెంట్స్ వైరల్
అందమైన ప్రేమ కథతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఓ చెలియా’.

దిశ, సినిమా: అందమైన ప్రేమ కథతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఓ చెలియా’. ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. నాగ రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మరో మెలోడీ సాంగ్‌ను హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్. కొంచెం కొంచెంగా అంటూ సాగే మెలోడీ ప్రజెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
సాంగ్ రిలీజ్ అనంతరం హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఓ.. చెలియా’ నుంచి మంచి మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశాను. ‘కొంచెం కొంచెంగా’ అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఓ మంచి మెలోడీ పాటను వినలేదు. హీరో హీరోయిన్లు చాలా చక్కగా కనిపిస్తున్నారు. లవ్, థ్రిల్లర్ ఇలా అన్ని అంశాల్ని కలగలపి సినిమాను తెరకెక్కించారని చెబుతున్నారు. ఇండస్ట్రీలోకి ఇలాంటి కొత్త టీం, కొత్త మేకర్స్ వస్తుండాలి. ఆడియెన్స్ కొత్త వారిని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అలానే ‘ఓ.. చెలియా’ టీంను ఆశీర్వదించాలి’ అని అన్నారు.






