నేను 6 సార్లు గెలిచాను, గుమ్మడి నరసన్న 5 సార్లు గెలిచారు: కోమటిరెడ్డి

by Ajay Maddhiboyina |

ఖమ్మంలో జరిగిన గుమ్మడి సర్సయ్య సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

నేను 6 సార్లు గెలిచాను, గుమ్మడి నరసన్న 5 సార్లు గెలిచారు: కోమటిరెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఖమ్మంలో జరిగిన గుమ్మడి సర్సయ్య సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గుమ్మడి నర్సయ్యతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. తాను ఒకసారి ఎంపీగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, నర్సన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. కానీ ఆయనకు తాను పోటీకి రానని అన్నారు. నర్సయ్యకు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఎవరూ పోటీ కాదని చెప్పారు.

ఆయన మహోన్నత వ్యక్తి అని చెప్పారు. ఎమ్మెల్యే అయినా తనకు ఉన్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూనే నర్సయ్య కుటుంబాన్ని పోషించుకున్నారని అన్నారు. తనకు వచ్చిన జీతాన్ని సైతం పేద ప్రజలకే పంచిపెట్టారని చెప్పారు. నర్సయ్య పాత్రలో శివరాజ్ కుమార్ నటించడం ఆనందంగా ఉందన్నారు. కామన్ మ్యాన్ నర్సయ్య పాత్రలో నటించడానికి శివరాజ్ కుమార్ ఒప్పుకున్నందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

Next Story