- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో కోమలి ప్రసాద్
హీరోయిన్ కోమలి ప్రసాద్ ‘మండవెట్టి’ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇస్తుంది. పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా.. తన కెరీర్‌లో కొత్త చాప్టర్ కానుంది.

దిశ, సినిమా : హీరోయిన్ కోమలి ప్రసాద్ ‘మండవెట్టి’ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇస్తుంది. పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా.. తన కెరీర్‌లో కొత్త చాప్టర్ కానుంది. టస్కర్స్ డెన్ పిక్చర్స్ బ్యానర్‌పై శరణ్ రాజ్ సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మండవెట్టి’ మూవీ టీమ్ లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసి షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. మనకు కావాల్సిన దాన్ని కోల్పోవటం వల్ల కలిగే బాధ, గుర్తింపు, జీవన పోరాటం వంటి అంశాలను మిళితం చేసి పెర్ఫామన్స్‌కు స్కోప్ ఉన్న కథను రూపొందించిన డైరెక్టర్ శరణ్‌రాజ్ సెంథిల్ కుమార్... ఇంతకు ముందు ‘వెల్ల కుదిర’వంటి సెన్సిబుల్, సైకలాజికల్ మూవీని రూపొందించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.






