అభిమాని పెళ్లికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేసిన సూర్య.. వైరల్ అవుతున్న వధువు రియాక్షన్

by Naga Rani Yarlagadda |

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానుల పట్ల ఎంతో ఉదారంగా ఉంటారో చూపే మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అభిమాని పెళ్లికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేసిన సూర్య.. వైరల్ అవుతున్న వధువు రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానుల పట్ల ఎంతో ఉదారంగా ఉంటారో చూపే మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ పెళ్లికూతుర్ని.. అదే అభిమానిని ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేశారు. తన పెళ్లికి సూర్య గెస్ట్ గా రావాలని ఆ పెళ్లికూతురు తన కోరికను వెల్లడించింది. సీన్ కట్ చేస్తే.. సూర్య ఆమె పెళ్లికి వెళ్లి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. తన పెళ్లి వేడుకలో విష్ చేసేందుకు సూర్య రావడాన్ని చూసిన ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేవు. సూర్యను చూడగానే ఆమెలో వచ్చిన రియాక్షన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన సూర్య అభిమానులు ఆయన మంచి మనసుకు ఫిదా అవుతున్నారు.

వీడియోలో పెళ్లికొడుకు సూర్యను ఆహ్వానించారు. సన్ గ్లాసెస్ పెట్టుకుని, వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ లో ఉన్న సూర్యను చూసి అతిథులంతా షాకయ్యారు. తమ ఆహ్వానాన్ని మన్నించి పెళ్లికి వచ్చినందుకు థాంక్యూ సర్ అని పెళ్లి కొడుకు వైరల్ అవుతున్న వీడియో కింద కామెంట్ చేశాడు.

Next Story