- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాస్ జాతర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా కోలీవుడ్ స్టార్.. ఇప్పుడే స్టార్ట్ అంటూ పోస్ట్
బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధం అవుతున్న చిత్రాల్లో ‘మాస్ జాతర’(Mass Jathara) ఒకటి.

దిశ, సినిమా: బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధం అవుతున్న చిత్రాల్లో ‘మాస్ జాతర’(Mass Jathara) ఒకటి. ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా నటిస్తుండగా.. భాను భోగవరపు (Director Bhanu Bhogavarapu)దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుండగా.. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్‌తో సందడి చేస్తున్నారు. అలాగే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను మరింతగా ఖుషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్ అక్టోబర్ 27న రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రీ రిలీజ్‌కు ఈవెంట్‌కు సంబంధించి బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ‘ఈ వేడుక ఇప్పుడే మరింత ఘనంగా స్టార్ట్ అయింది. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హీరో సూర్య (Suriya) హాజరు కానున్నారు’ అని అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూర్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుండగా.. భీమ్స్ సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు.






