కోడి రామకృష్ణ కండిషన్‌ నా సినీ ఎంట్రీకి కారణం.. అశోక్ కుమార్

by Pulgam srinivas |

కోడి రామకృష్ణ సినిమాలో నటిస్తేనే తన సినిమాలో నటిస్తానని చెప్పడంతో అశోక్ కుమార్ తొలిసారి నటుడిగా మారినట్లు వెల్లడించాడు.

కోడి రామకృష్ణ కండిషన్‌ నా సినీ ఎంట్రీకి కారణం.. అశోక్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అశోక్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చాలా కాలం పాటు నిర్మాతగా, నటుడిగా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించాడు. అయితే ప్రస్తుతం ఆయన దాదాపు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తాను నిర్మాతగా ఉన్న సమయంలో నటుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందనే విషయాన్ని అశోక్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ, “చాలా సంవత్సరాల క్రితం నేను నిర్మిస్తున్న ఒక సినిమాలో ఓ పాత్ర కోసం కోడి రామకృష్ణ గారిని సంప్రదించాం.

అప్పుడు ఆయన ‘అశోక్ కుమార్, నువ్వు నా సినిమాలో నటిస్తే నేను నీ సినిమాలో నటిస్తాను’ అని అన్నారు. నా పని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆయన సినిమాలో నటించాను” అని చెప్పారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకోకపోయినా, అందులో తన నటనకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. దాంతో తర్వాత అనేక సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని, అలా కోడి రామకృష్ణ గారి కారణంగానే తాను నటుడిగా మారాల్సి వచ్చిందని అశోక్ కుమార్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా విలన్ పాత్రల ద్వారా ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

Next Story