- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RC16 షూటింగ్ సెట్స్‌లో క్లింకార.. స్వయంగా పోస్ట్ చేసిన రామ్ చరణ్
రామ్ చరణ్(Ram Charan) - బుచ్చిబాబు(Buchibabu) కాంబినేషన్‌లో వస్తోన్న #RC16 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్(Ram Charan) - బుచ్చిబాబు(Buchibabu) కాంబినేషన్‌లో వస్తోన్న #RC16 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన ఆచార్య(Acharya), గేమ్ ఛేంజర్(Game Changer) రెండూ నిరాశ పర్చడంతో బుచ్చిబాబుపై మీద అభిమానులు కొండంత నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా #RC16 షూటింగ్ సెట్స్‌లోకి వచ్చిన రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. ‘సెట్స్‌కు మై లిటిల్ గెస్ట్ వచ్చింది’ అంటూ తన కూతురు క్లింకారా ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టారు. దీంతో అభిమానులంతా మెగా ప్రిన్సెస్ ఫేస్ చూపించు అన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఉప్పెన తర్వాత బుచ్చిబాబు చేస్తోన్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ హంగులతో రూపుదిద్దుకొంటోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ కూడా ‘నెవర్ బిఫోర్’ అనే రేంజ్‌లో ఉంటుందని తరచూ అటు బుచ్చిబాబుతో పాటు కొన్ని సందర్భాల్లో రామ్ చరణ్ కూడా చెప్పారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఉండే ఇండియన్ మట్టి స్టోరీ అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం ‘పెద్ది’ అనే టైటిల్ వైరల్ అవుతోంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి, అందరికీ అర్థమయ్యే టైటిల్ కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్.. సుకుమార్‌తో సినిమా చేయనున్నారు.






