KJQ: స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తమ్ముడు హీరోగా కొత్త సినిమా.. హీరోయిన్‌గా బోల్డ్ బ్యూటీ

by Chukka Sudharani |   (  Updated:2025-08-02 08:50:08  IST  )

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తమ్ముడు శశి ఓదెల (Shashi Odela), దసరా ఫేం దీక్షిత్ శెట్టి (Dixit Shetty) ప్రధాన పాత్రల్లో తెరకెక్కెతున్న లేటెస్ట్ మూవీ ‘KJQ’ (కింగ్ జాకీ క్వీన్).

KJQ: స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తమ్ముడు హీరోగా కొత్త సినిమా.. హీరోయిన్‌గా బోల్డ్ బ్యూటీ
X

దిశ, సినిమా: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తమ్ముడు శశి ఓదెల (Shashi Odela), దసరా ఫేం దీక్షిత్ శెట్టి (Dixit Shetty) ప్రధాన పాత్రల్లో తెరకెక్కెతున్న లేటెస్ట్ మూవీ ‘KJQ’ (కింగ్ జాకీ క్వీన్). ఈ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కె.కె దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘ఈ సిటీ.. గన్.. రెండు ఒక్కటే. ఎవడి చేతిలో ఉంటదో వాటి మాటే ఇంటది’ అనే బ్యాగ్రౌండ్ డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో ఎంతో ఆసక్తిగా సాగింది. ‘పోయి చెప్పు.. ఈ ఊరికి ఒక మొగాడు వచ్చాడు’ అని దీక్షిత్ చెప్పే డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

కాగా.. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ యుక్తి తరేజ (Yukti Thareja) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘మొగాడు గెలుచుకుంటాడు.. కానీవాడు లాక్కుంటాడు.. నువ్వేంటి’ అంటూ యుక్తి సినిమాపై అంచనాలను మరింత క్రియేట్ చేసింది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో యుక్తి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే 2023లో నాగ శౌర్య ‘రంగబలి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. రీసెంట్‌గా వచ్చిన ‘మార్కో’తో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు త్వరలో KJQతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

Next Story