Kiss : రొమాంటిక్‌గా ట్రైలర్ పోస్టర్.. సినిమాపై మరింత హైప్

by Chukka Sudharani |

సతీష్ కృష్ణన్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘కిస్’.

Kiss : రొమాంటిక్‌గా ట్రైలర్ పోస్టర్.. సినిమాపై మరింత హైప్
X

దిశ, సినిమా: సతీష్ కృష్ణన్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘కిస్’. ఇందులో కవిన్, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రోమియో పిక్చర్స్ బ్యానర్‌పై రాహుల్ నిర్మిస్తున్నారు. జెన్ మార్టిన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ కాగా.. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 19న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీంతో తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘కిస్’ ట్రైలర్ 09-09-2025న రాబోతున్నట్లు తెలుపుతూ మరో క్యూట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కూడా రొమాంటిక్ యూత్‌ను ఆకట్టుకుంటోంది. లింక్


Next Story