ఓజీ నుంచి మరో సర్‌ప్రైజ్.. కిస్ కిస్.. బ్యాంగ్ బ్యాంగ్ వచ్చేసింది..

by Chukka Sudharani |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం ప్రస్తుతం థియేటర్స్‌లో రన్ అవుతుంది.

ఓజీ నుంచి మరో సర్‌ప్రైజ్.. కిస్ కిస్.. బ్యాంగ్ బ్యాంగ్ వచ్చేసింది..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం ప్రస్తుతం థియేటర్స్‌లో రన్ అవుతుంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి సుజీత్ దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే.. ఇందులో హాట్ బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ చెయ్యగా.. అది రీసెంట్‌గానే మూవీలో యాడ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు మేకర్స్. ‘కిస్ కిస్.. బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ సాగే ఈ సాంగ్‌లో నేహా శెట్టి తన క్రేజీ డ్యాన్స్, హాట్ అందాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. రిలీజ్ చేసిన కొద్దిసేపటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంటుంది. ఇక మొత్తానికి ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు అట్రాక్షన్‌గా నిలిచింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. దీనికి తమన్ సంగీతం అందించాడు. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజైన ఈ మూవీ సక్సెస్ అందుకుని.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు భారీగానే రాబడుతున్నట్లు తెలుస్తుంది. LInk


Next Story