- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishkindhapuri : తప్పించుకునే అవకాశం లేదు భయం ఆక్రమించనుంది.. కిష్కింధపురి వాయిదాపై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా.. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిష్కిందపురి’.

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా.. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిష్కిందపురి’. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు మూవీ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే రిలీజ్‌పై మరోసారి క్లారిటీ ఇస్తూ.. ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చారు చిత్ర బృందం. ‘వాయిదా లేదు.. తప్పించుకునే అవకాశం లేదు.. సెప్టెంబర్ 12న బాక్సాఫీస్‌ను భయం ఆక్రమించనుంది.. కిష్కింధపురి ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతుంది. ఇక ట్రైలర్ సెప్టెంబర్ 3న ఉదయం 11:07 గంటలకు విడుదల అవుతుంది’ అని తెలిపారు. కాగా.. ఈ మూవీని షైన్ స్క్రీన్స్, అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, కౌశిక్ పెగళ్లపాటి నిర్మిస్తున్నారు. లింక్






