Kiran Abbavaram: నేను ఈ పాటలతో ప్రేమలో పడ్డాను.. ఇంట్రెస్టింగ్‌గా యంగ్ హీరో పోస్ట్

by Chukka Sudharani |

గతేడాది ‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)

Kiran Abbavaram: నేను ఈ పాటలతో ప్రేమలో పడ్డాను.. ఇంట్రెస్టింగ్‌గా యంగ్ హీరో పోస్ట్
X

దిశ, సినిమా: గతేడాది ‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. ఇప్పుడు లవ్ స్టోరీ (love story)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దిల్ రూబా’ (Dil Ruba). విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలింతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ (romantic entertainer)గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్ (Ruksar Dhillon) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల చేత వాయిదా పడింది.

ఇప్పుడు మార్చి 14న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయింది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి లవ్ బ్రేకప్ సాంగ్ (Love breakup song) ‘కన్నా నీ’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఫుల్ ఎమోషనల్స్ లిరిక్స్‌ (Emotional lyrics)తో వచ్చిన ఈ సాంగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు హీరో కిరణ్ అబ్బవరం. ఈ మేరకు ఈ సాంగ్‌లో నుంచి చిన్న బిట్‌ను షేర్ చేస్తూ.. ‘నేను ఈ పాటతో ప్రేమలో పడ్డాను.. మీరు కూడా ఇది చెయ్యండి’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story