- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kiran Abbavaram: ‘కె ర్యాంప్’ ఫస్ట్ లుక్ లోడింగ్ అంటూ కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ పోస్ట్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) గత ఏడాది ‘క’ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేశాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) గత ఏడాది ‘క’ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేశాడు. అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా కిరణ్ అబ్బవరం రేంజ్ కూడా మారిపోయింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కె ర్యాంప్’(K ramp). కిరణ్ అబ్బవరం 11వ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమాకు జైన్స్ నాని(Jains Nani) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యుక్తి తరేజా(Yukti Tareja) హీరోయిన్‌గా నటిస్తుండగా.. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యూలాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, శివ బొమ్మకు కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా, కిరణ్ అబ్బవరం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశాడు. ‘కె ర్యాంప్’ షూటింగ్ మొదలైనట్లు తెలిపాడు. అంతేకాకుండా ఓ సముద్రం వద్ద నిలబడి నడుముపై చేతి వేసుకుని ఉన్న పోస్టర్‌ను నెట్టింట పెట్టాడు. ఇక ఈ పోస్ట్ ఫన్ స్టార్ట్ అయిందంటూ క్యాప్షన్ జత చేశాడు. అలాగే త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా రాబోతుందంటూ హింట్ ఇచ్చాడు. ఇక అది చూసిన వారంతా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మరికొందరు మాత్రం ఈ సారి హిట్ సౌండ్ గట్టిగా వినపడాలని కామెంట్లు పెడుతున్నారు.






