- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ‘కె-ర్యాంప్’ ప్రారంభం.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గతేడాది ‘క’ (Kaa) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గతేడాది ‘క’ (Kaa) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31 రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. భారీ కలెక్షన్లను రాబట్టింది. ఆయన కెరీర్‌లోనే ‘క’ సినిమా హయ్యస్ట్ గ్రాసర్ (highest grosser)గా నిలిచింది. అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ (different subject) తరువాత ఈ యంగ్ హీరో చేస్తున్న నెక్ట్స్ ఎలాంటి సినిమా చేస్తారు? ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకుంటారు? అని ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం తన 11వ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు.
కొత్త డైరెక్టర్ జైన్స్ నాని (Jains Nani) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ ‘K-ర్యాంప్’ (K-ramp) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు అధికారికంగా తెలియజేశారు. ‘సామజవరగమన’, ‘ఊరుపేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్‌ల తర్వాత హాస్య మూవీస్ బ్యానర్ (Hashya Movies Banner)లో ప్రొడక్షన్ నంబర్ 7గా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ (Rajesh Danda) ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీ సంబంధించిన పూజ కార్యక్రమాలను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టారు. నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డైరెక్టర్స్ విజయ్ కనకమేడల, రామ్ అబ్బరాజు, యదు వంశీ, రైటర్ ప్రసన్న స్క్రిప్ట్ అందజేశారు. యోగి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి, సీనియర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ చూస్తుంటే.. కిరణ్ అబ్బవరం ఈసారి కూడా ర్యాంప్ ఆడించేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదేదో యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్‌లా కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరంను పూర్తిగా చూపించలేదు గానీ.. చుట్టూ ఆ మందిని చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసినట్టుగానే ఉన్నారు. టైటిల్ లోగోలో ఉన్న బొమ్మ, మందు సీసా, ఫుట్ బాల్‌ను చూస్తుంటే ఆడియన్స్ క్యూరియాసిటీ పెరిగేలా ఉంది. కాగా.. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా (Yukti Thareja) హీరోయిన్‌గా నటిస్తుండగా.. చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
https://x.com/SureshPRO_/status/1886312111669973425






