- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kingdom: ఫైనల్‌గా ‘కింగ్‌డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆనందంలో రౌడీ హీరో ఫ్యాన్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’.

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ (Surya Devara Naga Vamsi) నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అంతే కాకుండా.. ‘కింగ్‌డమ్’కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కాగా.. జూలై 4న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించిన చిత్ర బృంబం కొన్ని అనివార్య కారణాల చేత విడుదల వాయిదా వేసింది. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో అనేక వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ‘కింగ్‌డమ్’ రిలీజ్ డేట్‌పై మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని జూలై 25 రిలీజ్ చేసేందుకు సిద్ధపడుతున్నారట మేకర్స్. అంతే కాకుండా.. దాదాపుగా ఈ డేట్ ఫిక్స్ కాగా.. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






