- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారువేషంలో "కింగ్‌డమ్" సినిమా చూసిన టాలీవుడ్ హీరోయిన్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. ఈ సినిమా రెండు రోజుల కిందట రిలీజ్ అయి... పాజిటివ్ టాక్

దిశ, వెబ్ డెస్క్ : విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. ఈ సినిమా రెండు రోజుల కిందట రిలీజ్ అయి... పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాను.. మారువేషంలో టాలీవుడ్ హీరోయిన్ రష్మిక చూశారట. ఈ విషయాన్ని... నిర్మాత నాగ వంశీ బయటపెట్టారు. హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా వచ్చిన మూవీ కింగ్డమ్.
ఈ సినిమాకు గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అయితే గత నెల 31వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా... మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా నిర్మాత నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండకు హీరోయిన్ రష్మిక పెద్ద ఫ్యాన్ అని నాగ వంశీ వెల్లడించారు.
కింగ్డమ్ సినిమాను... శ్రీరాములు థియేటర్ కు వెళ్లి చూస్తానని ఆమె పేర్కొన్నారట. కానీ థియేటర్ యాజమాన్యం ఒప్పుకోలేదని నాగవంశీ వివరించారు. దీంతో మారువేషంలో భ్రమరాంబ హాలుకు వెళ్లి కింగ్డమ్ సినిమా రష్మిక చూసినట్లు నాకు వంశీ తాజాగా స్పష్టం చేశారు. ఈ విషయం... ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






